![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ షో విలేజ్ థీమ్ పేరుతో రాబోతోంది. ఇందులో శ్రీముఖి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వేసింది. ఏంటో ఈ వారం అన్ని షోస్ కూడా రెండర్థాల తెలుగు డైలాగ్స్ లేకుండా లేవు. శ్రీముఖి అంబటి అర్జున్ తో ఆ డైలాగ్ అనేసింది " నాకేమో ఇలాంటి కండ ఉన్న అబ్బాయి ఉంటే ఒక్కసారి నన్ను వెనక నుంచి ఎత్తుకుంటే బాగుండు అనిపిస్తుంది.. ఎత్తుకోవచ్చుగా" అని దీర్ఘం తీసేసరికి "వచ్చేయ్" అంటూ అర్జున్ శ్రీముఖిని ఎత్తేసుకున్నాడు. ఇక పొతే లాస్ట్ లో ఒక గేమ్ షో నడిచింది.
అందులో శ్రీకర్ కి పల్లవికి మధ్య గొడవ జరిగింది. శ్రీకర్ జడ్జ్ అనసూయ చూసి "జడ్జ్మెంట్ ఇవ్వండి" అనేసరికి "శ్రీకర్ నీ పని నువ్వు చూసుకో" అంది. "నేను అదే చేస్తున్నా" అనేసరికి " కాదు నువ్వు అలా చేయడం లేదు. నువ్వు జడ్జ్ ని ప్రశ్నిస్తున్నావ్..నేను మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతా" అంది. " నేను రిక్వెస్ట్ చేస్తున్నా" అని శ్రీకర్ మళ్ళీ అనేసరికి "నీకు ప్రశ్నించే ఎలాంటి రైట్ లేదు" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి అందరూ షాకైపోయారు. అసలక్కడ అంత సీరియస్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందన్నది ఎవరికీ అర్ధం కాలేదు. ఇక ఈ షో ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే ఫుల్ ఫైర్ అవుతున్నారు. "ఇలాంటి షోస్ వల్ల చిన్నపిల్లలా పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అనసూయ ఎందుకు అంత గట్టిగా మాట్లాడ్డం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |